రైతన్నలకు ఎరువుల పంపిణీ చేసిన టిడిపి నాయకులు

నందవరం, జూలై 1, త్రినేత్ర సత్యాన్వేషణ: మండల పరిధిలోని మాచాపురం, ఇబ్రహీంపురం తదితర గ్రామాలలో టిడిపి మండల కన్వీనర్ ఖాసీం వలి, పూలచింత బండే గురుస్వామి, శంకరమ్మ లు జూలై మాసం మొదటి రోజున కావడంతో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం రైతు సోదరులకు రసాయన ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదేశించారన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సోదరులకు ఎలాంటి ఎరువులు కొరత లేకుండా ప్రతి రైతుకు అవసరమైనంత ఎరువులను అందించడం జరుగుతుందని కావున రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రతి సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిషులు కృషి చేస్తున్నారని, అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రజల యొక్క యోగక్షేమాల కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లచ్చప్ప నాయుడు, జగ్గాపురం నరసింహులు, నగేష్ నాయుడు, బడిసావలి, వెంకట రాముడు, తిమ్మయ్య, కాలేవు, దావీదు, రంజాన్ ల తో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.