నందవరం, జూన్ 13: త్రినేత్ర సత్యాన్వేషణ: కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు తాలూకా, నందవరం గ్రామానికి చెందిన మాల రంగన్న (45) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆయనకు ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు.
రంగన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న రంగన్న ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గ్రామస్థులు, బంధువులు మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రంగన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ప్రభుత్వం స్పందించి తక్షణ ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు, స్థానికులు కోరుతున్నారు.