నందవరం, జూన్ 12: త్రినేత్ర సత్యాన్వేషణ: నందవరం మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వీర మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ప్రతి అమావాస్య రోజున సాయంత్రం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణం వల్ల సంకల్ప సిద్ధి తో పాటు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాను నిర్వాహకుల నమ్మకం. కావున ఆలయ కమిటీ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్రతి అమావాస్య రోజున ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

oplus_262146