పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మాధవరావు దేశాయ్
నందవరం, జూలై 1, త్రినేత్ర సత్యాన్వేషణ: మండల కేంద్రమైన నందవరం గ్రామంలో జూలై మాసం మొదటి రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నందవరం స్థానిక టిడిపి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవరావు దేశాయ్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎన్ని ప్రతికూల సమస్యలు ఉన్న మాసం మొదటి రోజునే పెన్షన్ల పంపిణీ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసా వహిస్తూ శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో కలిసి అర్హులైన ప్రతి లభిదారులకు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాధవరావు దేశాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండి సూపర్ సిక్స్ పథకాలు అమలు విషయంలో ఇటువంటి జాప్యం జరగడం లేదని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడమే కాకుండా అర్హత ఉండి కూడా పెన్షన్లు రాని వారిని గుర్తించి నూతన పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఇమ్రాన్ తోపాటు వీరి వెంట స్థానిక టిడిపి కార్యకర్తలు బెస్త ఈరన్న, చాకలి శ్రీనివాసులు, వెంకటేష్, ఇసా, అచ్చన్న, చాకలి ఈరన్న పాల్గొన్నారు.

